తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్స్

  • కొత్తగా 224 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,008
  • కోలుకున్న వారు 2,83,924  మంది 
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 224 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 461 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,008 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,83,924 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,566 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,518 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,439 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి.

COVID19
Corona Virus
Telangana

More Telugu News